GDWL: అయిజ మండలం ఉప్పల్ క్యాంప్ ఎస్సీ కాలనీలో రెండు రోజులుగా వీధి దీపాలు వెలగక ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయం వేస్తోందని, అధికారులు వెంటనే స్పందించి దీపాలు వేయించాలని కోరుతున్నారు.