KRNL: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో డీఆర్సీ (జిల్లా సమీక్షా కమిటీ) సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు.