NGKL: వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సైదులు డిమాండ్ చేశారు. అచ్చంపేట మండలం చందాపూర్ గ్రామంలో బుధవారం ఆయన కార్మికులతో సమావేశమయ్యారు. ఉపాధి హామీ కూలీలకు రోజు కూలి రూ.800 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, గ్రామాల్లో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.