»12th Iftar Dinner Under The Auspices Of The State Govt
LB Stadium : 12న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పవిత్రమైన రంజాన్ మాసం(The month of Ramadan) లో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తోంది. ఎల్బీ స్టేడియం (LB Stadium) లో 12న ఇఫ్తార్ విందు ( Iftar Party ) ఇవ్వాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కార్యదర్శి భూపాల్‌రెడ్డి(Secretary Bhupal Reddy)ని ఆదేశించారు.
తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పవిత్రమైన రంజాన్ మాసం(The month of Ramadan) లో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తోంది. ఎల్బీ స్టేడియం (LB Stadium) లో 12న ఇఫ్తార్ విందు ( Iftar Party ) ఇవ్వాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కార్యదర్శి భూపాల్‌రెడ్డి(Secretary Bhupal Reddy)ని ఆదేశించారు. యోట నిర్వహించే ఇఫ్తార్‌కు సీఎం స్వయంగా వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు రంజాన్ శుభాకాంక్షలను తెలుపుతారు.పేద ముస్లింలకు రంజాన్ తోఫా (Ramzan Tofa) అందజేస్తారు. ఇదిలా ఉండగా గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మంది నిరుపేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ చేయనున్నారు.
ఒక్కో కమిటీకి 500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 815 మసీదు మేనేజింగ్ కమిటీలకు ఇప్పటికే గిఫ్ట్ ప్యాకెట్లను సరఫరా చేశారు. ఈ ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిర్వహించనుంది. ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం మతపెద్దలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, సామాన్య ప్రజలు చేరనున్నారు. ముస్లిములు పవిత్ర మాసంగా ఆచరించే రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రతిఏటా (State Govt) అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. రంజన్‌కు రెండ్రోజుల ముందు మాత్రమే ఇచ్చేది.అయితే ఈసారి పది రోజుల ముందుగానే ఇవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఆయన చేసిన కామెంట్లపై కేసీఆర్ మౌనంగా ఉన్నారు. అయితే ఇఫ్తార్‌ను వేదికగా చేసుకొని విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. హిందూ, ముస్లిముల(Hindu, Muslims )ఐక్యతను చాటుతున్నామని, కానీ కొన్ని పార్టీలు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడనున్నట్లు సమాచారం.