»Rahane Who Was Beaten Chennais Big Win Over Mumbai
IPL-16 : దంచికొట్టిన రహానే .. ముంబైపై చెన్నై ఘనవిజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL )16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు.. రెండో విజయాన్ని నమోదు చేసింది. ముంబయి ఇండియన్స్(Mumbai Indians)తో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించేసింది. చెన్నై జట్టు బ్యాటర్లు అజింక్య రహానే(Ajinkya Rahane), రుతురాజ్ గైక్వాడ్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL )16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు.. రెండో విజయాన్ని నమోదు చేసింది. ముంబయి ఇండియన్స్(Mumbai Indians)తో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించేసింది. చెన్నై జట్టు బ్యాటర్లు అజింక్య రహానే(Ajinkya Rahane), రుతురాజ్ గైక్వాడ్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడారు. కళ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకున్నారు. ముంబయి బౌలర్లలో బెన్డార్ఫ్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ తలో వికెట్ పడగొట్టారు. ఐపీఎల్ 2023లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబైపై చెన్నై విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
158 పరుగుల టార్గెట్ ను 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. సీఎస్కే బ్యాటర్ అజింక్య రహానె రెచ్చిపోయి ఆడాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 27 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. 18.1 ఓవర్లలో చెన్నై జట్టు 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad)(36 బంతుల్లో 40 పరుగులు), శివమ్ దూబే(28), అంబటి రాయుడు(16) రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) 3 వికెట్లు పడగొట్టాడు. తుశార్ దేశ్ పాండే, మిచెల్ సాంట్నర్ తలో రెండు వికెట్లు తీశారు. మగళ ఒక వికెట్ తీశాడు. ఈ సీజన్ లో చెన్నైకి ఇది వరుసగా రెండో విజయం కాగా, ముంబైకి వరుసగా రెండో పరాజయం.
చెన్నై తన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) చేతిలో ఓడింది. రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై గెలుపొందింది. ఇక, ముంబై తన తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) చేతిలో ఓడింది. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ లో చెన్నై చేతిలో పరాజయం పాలైంది.ఈ మ్యాచ్ లో ముఖ్యంగా రహానె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రహానె తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. పరుగుల వరద పారించాడు. ఒకే ఓవర్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. అర్షద్ ఖాన్ (Arshad Khan) వేసిన నాలుగో ఓవర్ లో 6,4,4,4,4,1 కొట్టాడు. దాంతో ఒకే ఓవర్ లో 23 పరుగులు వచ్చాయి. ఇక, రహానె కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం హైలైట్.