Rohit Sharma: రోహిత్ శర్మ కెరీర్ లోనే పరమ చెత్త రికార్డు
ఈరోజు వాంఖడేలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు తొలి ఓవర్ లోనే కోలుకోలేని షాక్ తగిలింది.
Rohit Sharma: ఈరోజు వాంఖడేలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు తొలి ఓవర్ లోనే కోలుకోలేని షాక్ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో స్టేడియం మొత్తం నిశబ్దంగా మారింది. రోహిత్ శర్మ తర్వాత సమన్ ధీర్ కూడా తొలి బంతికే అవుట్ కావడంతో ముంబై ఇండియన్స్ జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడింది.
కాకపోతే ఈ మ్యాచ్‌లో 17 సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా రోహిత్ శర్మ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. కేవలం 20 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్.. కనీసం వంద పరుగులు చేయబోతున్నామా లేదా అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. కాసేపటి క్రితం మరో కీలక ఆటగాడు ఇషాన్ కిషన్ వికెట్ తీశాడు. ముంబై ఇండియన్స్ చేసిన 20 పరుగులలో ఇషాన్ కిషన్ 16 పరుగులు చేశాడు.