NZB : జక్రాన్పల్లి మండలం పడకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న చందన జాతీయ స్థాయి 46వ సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు గడ్డం శ్రీనివాస్ తెలిపారు. వెస్ట్ బెంగాల్ పోల్బనగర్లో ఈనెల 25 నుంచి మార్చి 1 వరకు జరిగే పోటీల్లో పాల్గొంటుందని చెప్పారు.