KMM: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వేడుకలకు సమాయత్తమైంది. మొత్తం 33 జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఈ రోజు ఏకకాలంలో ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.