KMM: దేశ అభివృద్ధికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఢిల్లీలోని బీర్ భూమి వద్ద అయన సమాధికి డిప్యూటీ సీఎం నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ తన హయాంలో దేశంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు.