RR: మియాపూర్‌లో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామప్రభు నేతృత్వంలో వేడుకలు ఘనంగా జరిగాయి. 1300 మంది మహిళలతో నిర్వహించిన ప్రతిభా పోటీలు, బహుమతి ప్రదానోత్సవం అలరించాయి. ఈ సందర్భంగా స్థానికుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రారంభించారు. సేవా కార్యక్రమాలతో ట్రస్ట్ ఆదర్శంగా నిలుస్తోందని ఈ సందర్భంగా కొనియాడారు.