MNCL: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్లో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులపై వేటు పడింది. బీట్ ఆఫీసర్ లవన్ కుమార్, డీఆర్ కుమారస్వామిని సస్పెండ్ చేసినట్లు ఎన్డీఓ రామ్మోహన్ బుధవారం ప్రకటించారు. అటవీ దొంగలకు సహకరించినా, విధుల్లో అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.