ASF: కాగజ్‌నగర్‌లోని పలు హోటళ్లలో ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ప్రణీల్ కుమార్, శానిటరీ ఇన్ స్పెక్టర్ శంకర్ తనిఖీలు చేశారు. హోటళ్లలో పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, వ్యర్థాల నిర్వహణను అధికారులు పరిశీలించారు. పరిశుభ్రత పాటించని కొన్ని హోటళ్లకు జరిమానాలు విధించారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించాలని హోటల్ యజమానులకు సూచించారు.