SRCL: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పవర్లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్ చార్జీల భారంపై ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు.