NZB: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓన్నాజీపేట శివారులోని ముత్యాల చెరువు కట్ట తెగి, వాడి గ్రామాన్ని ముంచెత్తాయి. శుక్రవారం కట్టను పరిశీలించడానికి వచ్చిన డీఈ ప్రేమ్, ఏఈ రాంప్రసాద్‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు. చెరువుకు కట్ట నిర్మించవద్దని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. కట్ట నిర్మిస్తే మళ్లీ వరదలు వచ్చినప్పుడు తెగిపోయి గ్రామం మునిగిపోతుందని వారు ఆవేదనవ్యక్తం చేశారు.