కరీంనగర్ పట్టణంలోని బొమ్మకల్ రోడ్డులో గల సిమెంటు పైపుల ఫ్యాక్టరీలో ఆదివారం దారుణం జరిగింది. బీహార్ రాష్ట్రానికి చెందిన వలస జీవులు బిట్టు కుమార్ సుధాదేవి దంపతుల కుమారులు సత్యం కుమార్, ఆర్యన్ కుమార్లు ప్రమాదవశత్తు పైపులు కూలింగ్ చేసే ట్యాంకులో పడిపోయారు. గమనించిన ఫ్యాక్టరీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు అప్పటికే వారు మృతి చెందారు.