BDK: మహిళ మృతికి కారకుడైన కారు డ్రైవర్‌కు ఒక సంవత్సరం 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కే సాయి శ్రీ మంగళవారం తీర్పు చెప్పారు. పడమటి నర్సాపురం గ్రామం వద్ద పాల్వంచకు చెందిన పవన్ కుమార్ కారు నడుపుతూ ఇంట్లో నిద్రిస్తున్న లలిత అనే మహిళను ఢీకొనగా ఆమె చనిపోయింది. విచారణలో నేరం రుజువు అయింది.