BDK: ఇల్లందు నియోజకవర్గం గోలియతండా లబ్ధిదారి సుజాత ఇందిరమ్మ ఇంటి నూతన గృహానికి భూమి పూజ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి నిరుపేదల సొంతింటి కల సహకారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.