NLG: కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోగికర్ రవీందర్ గుండెపోటుతో మరణించగా.. వారి మృతదేహానికి ఇవాళ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవీందర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గార్లపాటి రవీందర్ ఉన్నారు.