నిజామాబాద్లో న్యాయవాదిపై దాడికి పాల్పడ్డ ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్లు 2వ టౌన్ ఎస్సై సయ్యద్ ముజాహిద్ తెలిపారు. ఖిల్లా రోడ్డులో గతంలో న్యాయవాది ఖాసీంపై కొందరు వ్యక్తులు హత్యాయత్నం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ఆర్షద్ ఖాన్, అతని కుమారుడు ముజాహిద్ ఖాన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించామన్నారు.