JGL: మల్యాల(M)లో ఓ ఇంటితో పాటు దుకాణంలో దొంగతనం జరిగినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఎక్స్ రోడ్ ప్రాంతంలో ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి సుమారు రూ. 30,500 విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు, నగదును ఎత్తుకెళ్లారు. అలాగే ఓ టీషాప్ కిటికీనీ పగలగొట్టి రూ.7500 విలువ చేసే సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు అరుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.