BDK: జిల్లాలోని ట్రాన్స్జెండర్స్కి ఆర్ధిక పునరావాస పథకం కింద ఒక్కొక్క యూనిట్కి రూ.75 వేల చొప్పున మొత్తం 8 యూనిట్లకు వంద శాతం సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా తెలిపారు. wdsc.telangana.gov.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి సమర్పించాలని పేర్కొన్నారు.