ASF: ఆసిఫాబాద్ పట్టణ AIMIM పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మహ్మద్ సల్మాన్ ఖాన్, మహ్మద్ ఆఫ్జల్, షేక్ నసిర్ సుమారు 30మంది కార్యకర్తలతో కలిసి BRS పార్టీలో చేరారు. గురువారం MLA కోవ లక్ష్మి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. BRS పార్టీ విధి విధానాలు, MLA చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులైన తాము BRSలో చేరామన్నారు.