SDPT: చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామంలో హైనా దాడిలో లేగ దూడ తీవ్రంగా గాయపడింది. రైతు గాజుల కిష్టయ్య తెలిపిన వివరాలిలా.. లేగ దూడను తన వ్యవసాయ క్షేత్రం వద్ద శుక్రవారం కట్టేశారు. మరునాడు ఉదయం వెళ్లి చూసే సరికి తన లేగ దూడ తీవ్ర గాయాల పాలై ఉందన్నారు. హైనా దాడి చేసి ఉంటుందని అనుమానిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు బాధితుడు సమాచారం అందించారు.