NZB: జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల సమర్పణ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటిదాకా 102 మద్యం దుకాణాలకు సంబంధించి 262 దరఖాస్తులు వచ్చాయని మంగళవారం సాయంత్రం ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ స్టేషన్ పరిధిలోనే మొత్తం 36 వైన్ దుకాణాలకు 100 దరఖాస్తులు వచ్చాయన్నారు.