GNTR: జిల్లాలో ధాన్యం కొనుగోలు పారదర్శకతతో చేపట్టాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో మంగళవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కార్యకలాపాలు ప్రారంభమయ్యే ముందే గోనె సంచులు, రవాణా వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గోనెసంచులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.