NZB: రెంజల్ మండలంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను అందించనున్నట్లు పశు వైద్యాధికారి డాక్టర్ విట్టల్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15 నుంచి నవంబర్ 14 వరకు మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పశు సంపద కలిగిన రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.