బాపట్ల: జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బుధవారం ఉదయం భావన బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్న ఆమెకు డీఆర్వో గంగాధర్ గౌడ్, ఏఓ మల్లిఖార్జున రావు, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు స్వాగతం పలికి పూల బొకేలు అందించారు. అనంతరం వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తహసీల్దార్ సలీమా షేక్, కలెక్టరేట్ సిబ్బంది ఆమెను అభినందించారు.