కోనసీమ: జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశాల మేరకు అమలాపురంలోని ఆక్వా షాపులలో టాస్క్ఫోర్స్ అధికారులు మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఫిషరీస్ జేడీ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో, ఏపీఎస్ఏడీఏ (APSADA) అనుమతులు లేని షాపులకు రూ.1.50 లక్షల జరిమానా విధించారు. మిగతా షాపులన్నీ తప్పనిసరిగా అనుమతులు పొందాలని అధికారులు హెచ్చరించారు.