BDK: విద్యార్థులకు మెనూ ప్రకారం సమయానికి పౌష్టికాహారం అందించాలని ఎంపీడీవో తాళ్లూరి రవి తెలిపారు. జూలూరుపాడులోని ప్రభుత్వ ఎస్సీ విద్యార్థుల వసతి గృహాన్ని వారు బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించి, వంట గదిని తనిఖీ చేశారు. వంటశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.