ADB: మహిళల రక్షణ, భద్రత ప్రధాన లక్ష్యంగా ఆదిలాబాద్ షీ టీం బృందం అప్రమత్తతతో ఉంటూ విధులు నిర్వర్తిస్తుందని షీ టీం ఇంఛార్జ్ సుశీల శుక్రవారం తెలియజేశారు. నవరాత్రి ఉత్సవాలను తిలకించడానికి వేలాదిమంది ప్రజలు రాగా అందులో 5గురు ఆకతాయిలు మహిళలను వేధిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారన్నారు. మహిళలు అత్యవసర సమయంలో 100 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.