VKB: మర్పల్లి మండల కేంద్రంలో పోలీసులు మంగళవారం వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలను సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చని ఏఎస్సై భూపతి రెడ్డి అన్నారు. హెల్మెట్ ధారణ, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్, మైనర్స్ డ్రైవింగ్‌పై ప్రత్యేక అవగాహన కల్పించారు. వేగం కన్నా ప్రాణం మిన్న అని నినదించారు.