HYD: వేలమంది ప్రయాణించే కూడళ్లలోని గోడలపై పిచ్చిరాతలు, దుర్గంధాన్ని తొలగించేందుకు ‘తువక్కం’ అనే స్వచ్ఛంద సంస్థ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఈ సంస్థ ప్రతినిధులు నగరంలోని సుమారు 25 ప్రాంతాల గోడలపై సందేశాత్మక చిత్రాలను గీయించి, వాటికి కొత్త రూపు ఇచ్చారు. ట్రాఫిక్ నియమాలు, క్షయ వ్యాధిపై అవగాహన వంటి అంశాలపై ఈచిత్రాలు ఉన్నాయి.