KNR: జమ్మికుంట మున్సిపల్ ప్రజా ప్రతినిధులకు కరీంనగర్లో శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ ఆడిటోరియంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్, కమిషనర్ ఎండి ఆయాజ్, వైస్ ఛైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.