GDWL: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణీల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, హైరిస్క్ కేసులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించి, ఆవరణలో ఔషధ మొక్కలు నాటాలని సూచించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.