MLG: పల్లె ప్రాంతంలోని పిల్లలకు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి, వారిని ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేయాలని మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. చిన్న వయస్సులోనే సాంకేతికతకు పరిచయం కల్పించడం విద్యార్థుల శాస్త్రీయ ఆసక్తిని పెంచడమే కాకుండా, భవిష్యత్తులో సాంకేతిక రంగంలో మరింత ఎదగడానికి మార్గం దొరుకుతుందని సీతక్క అన్నారు.