NLG: దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో సోమవారం స్వచ్ఛత హి సేవ-2024 కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి ఆదేశానుసారం ఖిల్లా పార్క్లో శ్రమదానం చేశారు. పట్టణ పరిశుభ్రతలో ప్రజలు భాగస్వామ్యం కావాలని అవగాహన కల్పించారు. కౌన్సిలర్ పొన్నబోయిన భూదేవి సైదులు, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సకృనాయక్ పాల్గొన్నారు.