తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో నగదు, బంగారం, ఇతర రూపంలో అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 538.23 కోట్లకుపైగా ఉన్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు
కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ ఇంట్లో అర్ధరాత్రి పోలీసులు, ఎన్నికల ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు సోదాలు జరిపారు. వారితో మధుయాష్కీకి తీవ్ర వాగ్వివాదం జరిగింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ రణరంగం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీకి ధీటుగా ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వర్ధన్నపేట, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో పర్యటించిన క్రమంలో సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ 100 తప్పులు ఇప్పటికే పూర్తయ్యాయని రేవంత్ ఎద్దేవా చేశారు.
ఎన్నికల వేళ టీ, బిర్యానీ, బైక్, బస్ రెంటల్, పూల ధరలకు రెక్కలు వచ్చాయి. వాటితో అవసరం కాబట్టి.. ధర ఎంతయినా సరే ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు పెడుతున్నారు.
పదేళ్ల పిల్లాడి ఫేవరెట్ లీడర్ బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజా సింగ్ అట.. ఓ ఇంటర్వ్యూలో చెప్పగా.. వీడియో చూసిన రాజా సింగ్.. ఆ పిల్లాడిని తనకు ఎవరైనా కల్పించాలని కోరారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పరిధిలోని వట్టినాగులపల్లిలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు వెళ్లగా.. ప్రచారం చేయడానికి వీళ్లేదంటూ అడ్డు తగిలారు.
సిర్పూర్ నియోజకవర్గ వర్గంలోని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రవీణ్‌కుమార్, ఆయన కుమారుడిపై ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
కేటీఆర్ సీఎం పదవీ చేపట్టిన తనకు అభ్యంతరం లేదని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీలో మాదిరిగా తమ పార్టీలో కుమ్ములాటలు ఉండవని తేల్చిచెప్పారు.
అచ్చంపేట ఎమ్మెల్యే (Achampet MLA), బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వలబాలరాజు (MLA Guvvala Balaraju)పై వరుస దాడులు జరుగుతున్నాయి.మతిస్థిమితంలేని వ్యక్తి మట్టిపెళ్ల విసిరాడు. అయితే బాలరాజు అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమయ్యారు.
నవంబర్ 10వ తేదితో తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇకపోతే నేడు వాటిని ఈసీ పరిశీలించింది. 5563 అప్లికేషన్లు రాగా అందులో 2444 అప్లికేషన్లను మాత్రమే ఈసీ ఆమోదించింది. 594 మంది అప్లికేషన్లను ఈసీ రిజెక్ట్ చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. అయితే నామినేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది. నాగార్జునా సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు మరోసారి తన నోటి దూలను ప్రదర్శించారు. తనకు ఓటేసిన వారికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, వారి పిల్లలకు నౌకరీ పెట్టిస్తామని సభలో ప్రకటన చేసి.. దుమారం రేపారు.
అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై జరిగిన దాడి ఘటన..అధికార పార్టీ డ్రామా అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సర్వసాధారణమని గుర్తు చేశారు. అంతేకాదు గతంలో జగన్ మోహన్ రెడ్డిపై కత్తితో దాడి చేయడం, మమతా బెనర్జీ కాలికి గాయం వంటి ఘటనలను ప్రస్తావించారు.