ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు.
కేసీఆర్ దుష్టపాలనకు కామారెడ్డి చరమగీతం పాడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణ ప్రజల భవిష్యత్తను కామారెడ్డి ప్రజానీకం నిర్ణయించబోతుందన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు నేటి సాయంత్రంతో ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. 3 గంటల తర్వాత లైన్‌లో ఉన్నవారికి మాత్రం నామినేషన్లు వేసే అవకాశం కల్పించింది
తెలంగాణలో పటాన్ చెరు కాంగ్రెస్ టిక్కెట్ గురించి చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి రాజకీయాలు రచ్చకెక్కాయి. ఇక్కడి స్థానిక నేత నీలం మధు టిక్కెట్ ఆశించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. కానీ కాంగ్రెస్ మొదట పేరు ప్రకటించి చివరి జాబితాలో పేరు లేకపోవడంతో తాజాగా మధు బీఎస్పీ పార్టీలో చేరారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థుల తుదిజాబితాలు వచ్చేశాయి. తాజాగా బీజేపీ 14 మందితోకూడిన లిస్టును ప్రకటించగా..నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ కూడా నలుగురితోకూడిన జాబితాను వెలువరించింది. అయితే సీట్ దక్కిన వారు సంతోషంగా ఉండగా..రాని వారు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
బెల్లంపల్లికి చెందిన శేజల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాదు చిన్నయ్య అనేక మంది అమాయకులపై అక్రమ కేసులు పెట్టించారని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లడం ఖాయం అని కేంద్ర మంత్రి అశ్విని చౌబే అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, ప్రజల బాధలు తీరుస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ(telangana congress) మైనారిటీ డిక్లరేషన్ ను ప్రకటించింది. అయితే దీనిని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్(salman khurshid) విడుదల చేయగా..దీనికి మైనారిటీ వర్గాలకు కీలకమైన హామీలను ప్రకటించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శత్రువులతో చేతులు కలిపి ఆయన తనను జైలుకు పంపించాడని రేవంత్ వ్యాఖ్యలు చేశారు.
మొగలి రేకులు సీరియల్ నటుడు సాగర్ కు అరుదైన అవకాశం దక్కింది. ఇటివల జనసేన పార్టీలో చేరిన సాగర్ కు తెలంగాణ ఎన్నికల పార్టీ ప్రచార కార్యదర్శి పదవి లభించింది. అంతేకాదు తన స్వగ్రామమైన రామగుండం నుంచి కూడా సాగర్ పోటీ చేస్తుండటం విశేషం.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ పాల్గొన్న రోడ్ షోలో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రచార వాహనం రెయిలింగ్ విరిగి పడడంతో పై నుంచి సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి కిందపడ్డారు.
పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు.