»Revanths Comments Are The Reason For Contesting In Kamareddy
CMKCR : కామారెడ్డిలో పోటీ చేయడానికి కారణం అదే రేవంత్ కామెంట్స్
కేసీఆర్ దుష్టపాలనకు కామారెడ్డి చరమగీతం పాడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణ ప్రజల భవిష్యత్తను కామారెడ్డి ప్రజానీకం నిర్ణయించబోతుందన్నారు.
సీఎం కేసీఆర్ (CMKCR) పాలనకు కామారెడ్డి చరమగీతం పాడబోతోందని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును కామారెడ్డి నిర్ణయిస్తుందని రేవంత్ చెప్పారు. కేసీఆర్ గజ్వేల్(Ghazwal)ను బంగారు తునగ చేసి ఉంటే కామారెడ్డి ఎందుకు పారిపోయి వచ్చాడని ఆయన అన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ ఏ రోజు సచివాలయానికి రాలేదని ధ్వజమెత్తారు. కామారెడ్డి(Kamareddy)కి చెందిన రైతు లింబయ్య సచివాలయం ముందే ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. అంతేకాకుండా ఇదే ప్రాంతానికి చెందిన బీరయ్య అనే రైతు ధాన్యంపైనే గుండె ఆగి చనిపోయాడన్నారు.
గజ్వేల్ వాసులను పదేళ్లపాటు మోసం చేసిన కేసీఆర్కు ఇవాళ కోనాపూర్ గుర్తు వచ్చిందా అని ప్రశ్నించారు. కామారెడ్డి భూములపై సీఎం కేసీఆర్ కన్ను పడిందని, అందుకే ఆయన ఇక్కడ నుండి పోటీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ ఏ రోజు సచివాలయానికి రాలేదని ధ్వజమెత్తారు. కామారెడ్డికి చెందిన రైతు లింబయ్య సచివాలయం ముందే ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. అంతేకాకుండా ఇదే ప్రాంతానికి చెందిన బీరయ్య అనే రైతు ధాన్యంపైనే గుండె ఆగి చనిపోయాడన్నారు. గజ్వేల్ వాసులను పదేళ్లపాటు మోసం చేసిన కేసీఆర్కు ఇవాళ కోనాపూర్ (Konapur) గుర్తు వచ్చిందా అని ప్రశ్నించారు. కామారెడ్డి భూములపై సీఎం కేసీఆర్ కన్ను పడిందని, అందుకే ఆయన ఇక్కడ నుండి పోటీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.