»Hyderabad City Police Said Crackers Should Be Burst From 8 To 10 Pm On The Day Of Diwali
Hyderabad Police: పోలీసుల సూచన.. దీపావళి క్రాకర్స్ కాల్చేందుకు 8 నుంచి 10గంటల వరకే అనుమతి
ఎల్లుండి దీపావళి పండుగ జరుగనుంది. ఈ సందర్భంగా పటాకులు కాల్చడంపై హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేశారు. పర్యావరణ అనుకూలమైన, సురక్షితమైన దీపావళిని జరుపుకోవడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
Hyderabad Police: ఎల్లుండి దీపావళి పండుగ జరుగనుంది. ఈ సందర్భంగా పటాకులు కాల్చడంపై హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేశారు. పర్యావరణ అనుకూలమైన, సురక్షితమైన దీపావళిని జరుపుకోవడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. కాగా, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో దీపావళి రోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు క్రాకర్లు పేల్చాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
దీంతో పాటు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మినహా రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చరాదని, ఇతర సమయాల్లో అధిక శబ్ధం వచ్చే క్రాకర్లను పేల్చవద్దని తెలిపారు. ప్రజారోగ్యం దృష్ట్యా టపాసులు కాల్చవద్దని ప్రజలను కోరారు. దీని వల్ల వాయు, శబ్ధ కాలుష్యం పెరుగుతుంది. అలా కాకుండా గ్రీన్ కాకర్స్ తో పండుగ చేసుకోవాలని సూచించారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 12 నుంచి 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. పై ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, 1348 ఫాస్లీ (నం. IX), అమలులో ఉన్న ఇతర సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.