SDPT: పట్టణంలోని రాఘవేంద్ర నగర్ 11కేవీ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతులు ఉన్నందున బుధవారం ఉ.8.30 నుంచి మ. 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. సీతారాంనగర్, ఇందిరానగర్, వడ్డెర కాలనీ, FCI గోదాం, ఎల్లారెడ్డి నగర్, సాయి ఐటీఐ, లెక్చరర్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉండనున్నట్లు తెలిపారు.