PDPL: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు నేడు న్యూయార్క్ బయలుదేరారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో భారతదేశం తరఫున తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశాభివృద్ధి, సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేదికపై పెద్దపల్లి ఎంపీ పాల్గొనడం గర్వకారణం అని జిల్లా ప్రజలు పేర్కొంటున్నారు.