MNCL: రన్నింగ్ బైక్‌కు నిప్పు అంటుకున్న సంఘటన ఖానాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఖానాపూర్ పట్టణంలోని మస్కాపూర్ వద్ద రన్నింగ్ బైకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్ నడుపుతున్న వారు అప్రమత్తమై దూరంగా వెళ్లిపోయారు. కాసేపు బైక్‌లో మంటలు చెలరేగాయి. స్థానికులు ఆ బైక్ లో చెలరేగిన మంటలను సకాలంలో ఆర్పి వేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.