CTR:పెనుమూరు మండలంలోని బలిజపల్లికి చెందిన ఓ యువతి అదృశ్యమైన ఘటన మంగళవారం సాయంత్రం వెలుగు చూసింది. ఎస్సై వెంకట నరసింహులు వివరాలు తెలిపిన మేరకు.. బలిజపల్లికి చెందిన ఉషశ్రీ ఐదవ తేదీ మూడు గంటల నుంచి కనిపించడంలేదని ఆమె తల్లిదండ్రు తెలిపారు. దీంతో చుట్టుపక్కల బంధువులకు సమాచారం చేరవేసినా ఫలితం లేకపోవడంతో తమకు సమాచారం ఇచ్చారని ఎస్సై వెంకట నరసింహులు తెలిపారు.