TG: రాష్ట్రంలో 17 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాలలో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. అలాగే, రేపు 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Tags :