GNTR: వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జీఎస్టీ 2.Oపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. కేంద్రం చేసిన మార్పులపై వ్యాపారులకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సుకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరవుతారని టీడీపీ వాణిజ్య విభాగం నాయకులు తెలిపారు.