BPT: మార్టూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జనార్దన్ కాలనీలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కాలనీకి చెందిన రాంబాబు (38) ప్రమాదవశాత్తు ఇంటిదగ్గర కరెంట్ షాక్కు గురయ్యాడు. అతన్ని మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.