TG: కేంద్ర బృందం ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనుంది. జిల్లాలోని ఐదు మండలాల్లో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించనుంది. మెదక్ నిజాంపేట, రామాయంపేట, హవేలీఘనపూర్, పాపన్నపేటలో కేంద్ర బృందం సభ్యులు పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయనున్నారు. ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి ఈ పర్యటన కొనసాగనుంది.