KMM: గర్భస్థ లింగ నిర్ధారణ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన పీసీపీఎన్డిటి యాక్ట్ సమావేశంలో మాట్లాడుతూ.. రిజిస్టర్ కాని స్కానింగ్ సెంటర్లను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి స్కానింగ్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు.