»Mogalirekulu Sagar Is Key Role In Telangana Elections By Pawan Kalyan
Mogalirekulu Sagar:కు పవన్ కల్యాణ్ కీలక పదవీ
మొగలి రేకులు సీరియల్ నటుడు సాగర్ కు అరుదైన అవకాశం దక్కింది. ఇటివల జనసేన పార్టీలో చేరిన సాగర్ కు తెలంగాణ ఎన్నికల పార్టీ ప్రచార కార్యదర్శి పదవి లభించింది. అంతేకాదు తన స్వగ్రామమైన రామగుండం నుంచి కూడా సాగర్ పోటీ చేస్తుండటం విశేషం.
Mogalirekulu Sagar is key role in telangana elections by Pawan Kalyan
తెలంగాణలో ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేన పార్టీ కూడా పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ (janasena party) భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (kishan reddy) పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపి ఇప్పటికే పొత్తు పెట్టుకున్నారు. అంతేకాదు ఇప్పుడు పొత్తులో భాగంగా 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. కూకట్ పల్లి ప్రాంతంలో జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇటివల మొగలిరేకులు సీరియల్ హీరో సాగర్(sagar) జనసేన పార్టీలో చేరారు. ఈ క్రమంలో సాగర్ కు పవన్ కీలక బాధ్యతలు అప్పగించారు. సాగర్ ను తెలంగాణలో జనసేన పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్(hyderabad) జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ సాగర్ కు నియామక పత్రాన్ని అందజేశారు.
కొన్ని రోజుల క్రితం సాగర్ పవన్ కళ్యాణ్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో పంచుకున్న మధుర క్షణాల గురించి చెబుతూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో కూడా షేర్ చేశాడు. పవన్ కళ్యాణ్ ని లాంఛనంగా కలిశానని అందరూ అనుకున్నారు. కానీ సాగర్ ఇలా జన సేన పార్టీలో చేరతాడని ఎవరూ అనుకోలేదు. చేరడమే కాకుండా స్వగ్రామం రామగుండం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు. పొత్తులకు అతీతంగా పార్టీ కోసం పని చేస్తానని, చివరి శ్వాస వరకు నా ప్రయాణం జనసేన పార్టీతోనే ఉంటుందని సాగర్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాగర్ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.